యవ్వనం కోసం ఐదు సూపర్ ఫుడ్స్..

సాధారణంగా జంక్ ఫుడ్స్, స్వీట్స్ ప్రజలు ఎక్కువగా తినేస్తుంటారు. 

కానీ ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. 

అందుకే ఇలాంటి బ్యాడ్ ఫుడ్స్‌కు వీలైనంత దూరంగా ఉండటం మంచిది.

వీటికి బదులు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించి.. యవ్వనాన్ని పెంచే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. 

జీవితాంతం ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండాలంటే 5 సూపర్‌ఫుడ్స్‌ రెగ్యులర్‌గా తినాలి. 

ఆకుకూరలు.. క్యాబేజీ, పాలకూర, కొత్తిమీర వంటి ఆకుకూరలు మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

ఫ్యాటీ ఫిష్.. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును తగ్గిస్తాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచేస్తాయి.

గింజలు, విత్తనాలు.. నట్స్, సీడ్స్‌ అన్నీ సూపర్‌ఫుడ్స్ కిందకు వస్తాయి. వీటితో బెల్లి ఫ్యాట్ కరుగుతుంది.

బ్లూబెర్రీస్.. బ్లూబెర్రీస్‌లో యాంథోసైనిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చాలా మంచి ఆహారం.

యాపిల్.. రోజుకు ఒక యాపిల్ తినడం వల్ల ఆరోగ్యానికి మంచి ప్రయోజనం చేకూరుతుంది.

గమనిక.. ఇది సోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.