ఈ స్టడీ హాల్లో చదివితే.. పక్కా ఉద్యోగం.. 

ఈ స్టడీ హాల్లో చదివితే పక్కాగా ఉద్యోగం సాధించవచ్చు.

లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ , వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత స్టడీ హాలు ఏర్పాటు చేయడం జరిగింది.

ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు స్టడీ ఆల్ ఓపెన్ ఉంటుంది.

అలాగే ఈ స్టడీ హాల్లో ప్రిపేర్ అయిన వారికి దాదాపు 15 మందికి వివిధ రకాల ఉద్యోగాలు రావడం జరిగింది.

ఈ స్టడీ హాల్లో ఉచిత వాటర్ సౌకర్యం, కొంతమందికి ఉచిత పుస్తకాలు, స్టడీ చెయిర్స్ యువతకు ఇవ్వడం జరిగింది.

ఈ స్టడీ హాల్లో ప్రశాంతమైన వాతావరణం చదువుకోడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడకు వచ్చి చదువుకునే యువత చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రానున్న రోజుల్లో కూడా నిరుద్యోగులకు అండగా ఉండాలని ప్రతి రోజు స్టడీ హాల్ కు వచ్చే శేఖర్ తెలియజేశారు.

ఇక్కడికి వచ్చి చదువుకున్న యువత టీచర్ పోలీస్ డ్రగ్ ఇన్స్పెక్టర్ గ్రూప్ 4 ఉద్యోగాలు సాధించారు.