ఇక్కడ చేపలు, రొయ్యలకు భలే డిమాండ్.. 

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో తాజా రొయ్యలు చేపలు దర్శనమిస్తున్నాయి.

సుమారు రెండు నెలల విరామం తరువాత విశాఖ సముద్ర జలాల్లోకి ఫిషింగ్ బోట్లు వేటకు వెళ్ళాయి.

అయితే 60 రోజుల పాటు చేపల వేటకు ఏటా విరామం ప్రకటిస్తారు.

అంతేకాకుండా ఏ ఒక్కరూ విరామ సమయంలో వేటకు వెళ్లరాదని ప్రభుత్వ ఆదేశాలు ఉండడంతో మత్స్య సంపద అలాగే ఉంటుంది.

ఈ సమయంలో సముద్రంలో రొయ్యలు, చేపలు బాగాపెరుగుతాయి.

ఈ నెల 15 అర్ధరాత్రి నుంచి తిరిగి మత్స్యకారులు తమ వేటను ప్రారంభించారు.

అయితే తొలుత రొయ్యల వేటపైనే మత్స్యకారులు అధికంగా దృష్టి సారించారు.

నాలుగు రోజుల నుంచి చేపల వేటకు వెళ్లే వారికి పింక్ బ్రౌన్ రొయ్యలు అత్యధికంగా లభిస్తున్నాయి.

వీటి ఖరీదు కేజీ రూ.200 వరకు మార్కెట్లో పలుకుతోంది అని మత్స్యకార నాయకులు ఆనంద్ అంటున్నారు.

స్థానిక అమ్మకాలు కాకుండా పింక్ బ్రౌన్ రొయ్యలకు విదేశాల్లో అత్యంత డిమాండ్ ఉంది.