బడ్జెట్ ధరలో 200MP కెమెరా‌ స్మార్ట్‌ఫోన్స్

బెస్ట్ కెమెరా ఫీచర్‌తో లభించే ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త.

ప్రస్తుతం మార్కెట్‌లో పలు స్మార్ట్‌ఫోన్స్ అదిరే కెమెరా ఫీచర్‌తో మార్కెట్‌లో లభిస్తున్నాయి.

మోటారోలా, రెడ్‌మి, రియల్‌మి ఇలా కంపెనీలకు చెందిన కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌లో 200 ఎంపీ కెమెరా ఉంది.

ఇన్‌ఫినిక్స్ జీరో అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లో 200 ఎంపీ కెమెరా ఉంది. దీని ధర రూ. 29,999గా ఉంది.

రెడ్‌మి నోట్ 12 ప్రో ప్లస్ ఫోన్ కూడా 200 ఎంపీ కెమెరా ఫీచర్ కలిగి ఉంది ధర కూడా రూ. 29,999.

మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్‌లో కూడా 200 ఎంపీ కెమెరా ఫీచర్ ఉంది. ఈ ఫోన్ రేటు రూ. 54,999గా ఉంది.

రియల్‌మి 11 ప్రో ప్లస్ ఫోన్‌లోనూ 200 ఎంపీ కెమెరా ఫీచర్ ఉంది. దీని ధర రూ. 27,999గా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ఫోన్‌లో 200 ఎంపీ కెమెరా ఉంటుంది.

అందువల్ల కొత్త ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ స్మార్ట్‌ఫోన్లను ఒకసారి పరిశీలించొచ్చు.