ఆవలింత ఒకరికి వస్తే మరొకరికి కూడా ఎందుకు వస్తుంది..!

ఆవలింత తరచుగా తగినంత నిద్ర లేదా క్రానిక్ ఫెటీగ్‌కు సంకేతంగా ఉంటుంది. 

శరీరం పునరుద్ధరణ విశ్రాంతిని కోల్పోయినప్పుడు అది ఆవలింతను ప్రేరేపించడం ద్వారా శక్తి భర్తీ అవుతుంది.

ఆవలింత ద్వారా మెదడుకి అధిక ఆక్సిజన్ అందుంతుంది.

ఇది తాత్కాలికంగా చురుకుదనాన్ని పెంచడానికి సహాయపడుతుంది.

అవలింతలు వస్తున్న వ్యక్తిని చూసి మనకు కూడా వస్తుంటాయి. 

నిజానికి ఆవలింత మెదడుకు సంబంధించినదని పరిశోధన చెపుతోంది. 

ఆవలింతకు వాతావరణానికి కూడా సంబంధం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. 

నిజానికి వేసవిలో కంటే చలికాలంలోనే ఎక్కువ మంది ఆవలింతలు వస్తాయి. 

ఒక వ్యక్తి ఆవులించడం చూసినప్పుడల్లా అతని మిర్రర్ న్యూరాన్ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. 

మిర్రర్ న్యూరాన్ వ్యవస్థ సక్రియం అయినప్పుడు, అది ఇతరులను అనుకరించమని ప్రేరేపిస్తుంది. 

అందుకే ఇతరులకు ఆవలింత వచ్చిన వెంటనే మనకు కూడా ఆవలింత వస్తుంది.