AP New Scheme: రైతుల అకౌంట్లోకి రూ.26 వేలు

ఏపీలో చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టాక వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

కొత్త పథకాలను ప్రారంభిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు.

అంతే కాకుండా.. గత ప్రభుత్వం అమలు చేసి పథకాల పేర్లను కూడా మారుస్తూ ముందుకు వెళ్తున్నారు.

ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వరుసగా నెరవేరుస్తున్నారు.

తాజాగా వైఎస్సార్ రైతు భరోసా పథకం పేరును అన్నదాత సుభీభవగా మార్చారు.

అంతే కాకుండా.. రైతులకు అందించే పెట్టుబడి సాయంకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.

సుఖీభవ పథకానికి సంబంధించి వెబ్ సైట్లో కూడా కీలక మార్పులు చేశారు.

అన్నదాత సుఖీభవ వెబ్ సైట్‌లో సీఎం చంద్రబాబు నాయుడు, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫోటోలను ఉంచారు.

2019లో చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకొచ్చారు.

తాము అధికారంలోకి వస్తే ఏటా రూ.20 వేలు ఇస్తామని అప్పట్లో ప్రకటించారు.

దీనినే ప్రస్తుతం సూపర్ సిక్స్ లో ప్రకటించారు.

ఇది అమలైతే రైతుల ఖాతాల్లో ఏడాదికి రూ. 26 వేలు అకౌంట్లో జమ కానున్నాయి.