Metro Jobs: మెట్రోలో ఉద్యోగాలు..

చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. 

నోటిఫికేషన్‌లో భాగంగా జనరల్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. 

ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌, రోలింగ్‌ స్టాక్‌, పవర్‌ సిస్టమ్స్‌ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను పోస్టుల ఆధారంగా సంబంధిత విభాగంలో బీటెక్ ఉత్తీర్ణత పొంది ఉండాలి. 

అభ్యర్థుల వయసు 30 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. 

అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎంపికైన వారికి నెలకు రూ. 60,000 నుంచి రూ. 2.3 లక్షల వరకు చెల్లిస్తారు.