సంపూర్ణ జీర్ణక్రియకు సూపర్ స్మూతీలు

స్మూతీలు సహజ సిద్ధమైనవి. వీటిలో నూనె పదార్థాలు, చెడు పదార్థాలు ఉండవు. అందువల్ల ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

జీర్ణక్రియకు మేలు చేసే కొన్ని త్వరగా ప్రిపేర్ చేసుకునే స్మూతీలు తెలుసుకుందాం.

పైనాపిల్ అల్లం స్మూతీ: పైనాపిల్‌లో బ్రోమెలైన్ ఎంజైమ్ జీర్ణక్రియను పెంచుతుంది. అల్లం కూడా పొట్టకు ప్రశాంతత కలిగిస్తుంది.

బొప్పాయి, పుదీనా స్మూతీ: బొప్పాయి జీర్ణక్రియకు మేలు చేసే ఎంజైమ్‌లు ఎక్కువగా ఉంటాయి. పుదీనా కడుపును చల్లబరుస్తుంది. 

అరటి, బాదాం స్మూతీ: అరటిలో ఎనర్జీ జీర్ణక్రియను పెంచుతుంది. బాదాం ఆరోగ్యకరమైన ఫ్యాట్, ఫైబర్ ఇస్తుంది. 

కివి, బచ్చలికూర స్మూతీ: కివిలో ఫైబర్, ఆక్టినిడైన్ ఎంజైమ్ ప్రోటీన్ జీర్ణక్రియలో సహాయపడతాయి. బచ్చలికూర వల్ల జీర్ణక్రియ పెరుగుతుంది.

యాపిల్, చియా సీడ్ స్మూతీ: యాపిల్స్‌లో ఫైబర్, చియా సీడ్స్‌లో ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్.. జీర్ణక్రియకు సహాయపడతాయి.

యోగర్ట్, బెర్రీ స్మూతీ: యోగర్ట్‌లోని ప్రోబయోటిక్స్ పేగుల ఆరోగ్యాన్ని పెంచుతాయి. బెర్రీస్‌లో యాంటీఆక్సిడాంట్స్, ఫైబర్ కూడా జీర్ణక్రియను పెంచుతాయి.

ఆవకాడో, కీరదోసకాయ స్మూతీ: ఆవకాడో పోషకాలను బాగా స్వీకరించేలా చేస్తుంది. కీరదోసకాయ జీర్ణక్రియకు హైడ్రేషన్ ఇస్తుంది.

ఇలా ఈ స్మూతీలను కొద్ది మొత్తంలో తీసుకోవడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరచుకోవచ్చు. మలబద్ధకానికి చెక్ పెట్టవచ్చు.

మీ ఆరోగ్య పరిస్థితిని బట్టీ.. మీకు స్మూతీలు సెట్ అవుతాయో లేదో, మీ ఆరోగ్య నిపుణులను అడిగి తెలుసుకోండి.