దానిమ్మతో ఇలా చేస్తే నిమిషాల్లో మెరిసే స్కిన్

దానిమ్మ చాలా ప్రయోజనకరమైన పండు. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దానిమ్మ మీ మానసిక, శారీరక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది

దానిమ్మలో పోషకాలు ఎక్కువే. పీచు, విటమిన్లు, ఐరన్, పొటాషియం, జింక్, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ వంటివి దానిమ్మ తొక్కలో లభిస్తాయి.

అనేక చర్మ సమస్యలను తొలగించడానికి మీరు దానిమ్మ తొక్కను వాడొచ్చు. ఇది మీ చర్మ మచ్చలు, వృద్ధాప్య సమస్యలను తొలగిస్తుంది.

దానిమ్మ తొక్క వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు, ఉపయోగాలు తెలుసుకుందాం.

దానిమ్మ తొక్కను ఎండబెట్టి, పొడి చేసి, ఆ పొడిలో పెరుగు వేసి, చిక్కని పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించాలి. మీరు దీన్ని స్కిన్ మాయిశ్చరైజర్‌గా వాడొచ్చు.

మొటిమలను వదిలించుకోవడానికి, దానిమ్మ తొక్క పొడిలో పెరుగు, ఎసెన్షియల్ ఆయిల్ లేదా రోజ్ వాటర్ మిక్స్ చేసి, ఆ పేస్ట్‌ను ముఖానికి రాసుకోవచ్చు.

చర్మంపై ముడతలు తొలగిపోవడానికి రోజ్ వాటర్‌లో దానిమ్మ తొక్కల పొడిని కలిపి పేస్ట్ చెయ్యండి. చర్మంపై అప్లై చేసి, చల్లటి నీటితో ముఖం కడుక్కోండి.

స్కిన్ టోన్ మెరుగుపరచడానికి రోజ్ వాటర్, పచ్చి పాలు, దానిమ్మ తొక్క పొడిని కలిపి సహజ స్క్రబ్‌ చేసుకోండి. చర్మంపై అప్లై చేసుకోండి.

దానిమ్మ పొడితో ఫేస్ ప్యాక్ వేసుకుంటే.. చర్మంపై గ్లో వస్తుంది. ఇది మీ స్కిన్ టోన్‌ని మెరుగుపరుస్తుంది.

ఇలా దానిమ్మ పండ్ల తొక్కలతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీరు ఆన్‌లైన్‌లో కూడా ఈ పొడిని ఆర్డర్ చేసుకోవచ్చు.

ఏదైనా చర్మంపై అప్లై చేసే ముందు, ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఆరోగ్య నిపుణుల సలహాలు పాటించండి.