దేశంలో టాప్-10 అత్యుత్తమ, చెత్త వంటకాల లిస్టును ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ విడుదల చేసింది.
దేశంలో టాప్-10 అత్యుత్తమ వంటకాల లిస్ట్‌లో మొదటి స్థానంలో మ్యాంగో లస్సీ నిలిచింది.
దేశంలో టాప్-10 అత్యుత్తమ వంటకాల లిస్ట్‌లో ఛాయ్‌కి కూడా చోటు దక్కింది. చాయ్ మసాలాకి రెండో స్థానం దక్కింది.
రెస్టారెంట్‌లో ఎక్కువగా తినే బటర్ గార్లిక్ నాన్‌కి టాప్-10 అత్యుత్తమ వంటకాల్లో మూడో స్థానం లభించింది.
పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువగా లభించే అమృత్ సారి కుల్చా వంటకానికి నాలుగో స్థానం లభించింది.
రెస్టారెంట్, హోటల్స్‌లో ఎక్కువగా సేల్ అయ్యేవాటిల్లో బటర్ చికెన్ ఒకటి. దీనికి ఈ లిస్ట్ ఐదో స్థానం లభించడం విశేషం.
బిర్యానీ అంటే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది హైదరాబాదీ బిర్యానీ. హైదరాబాదీ బిర్యానీకి ఈ టాప్-10 లిస్ట్‌లో ఆరో స్థానం లభించింది.
పన్నీర్ కరీ తినేవారికి షాహీ పనీర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షాపీ పనీర్ అత్యత్తుమ వంటకాల జాబితాలో ఏడో స్థానం దక్కింది.
నార్త్ ఇండియాలో చోలే బటూరే అంటే తెలియని వాళ్లు ఉండరు. ఈ రుచికరమైన వంటకానికి దేశంలోని అత్యుత్తమ వంటకాల్లో ఎనిమిదో స్థానం లభించింది.
నాన్ వెజ్ లవర్స్‌కి చికెన్ అంటే ప్రాణం. అందులోనూ తందూరీ చికెన్ అంటే లొట్టలేసుకుని తింటారు. ఈ తందూరీ చికెన్‌కి టాప్-10 లిస్ట్ తొమ్మిదో స్థానం దక్కింది.
వెజ్ ప్రియులు ఎక్కువగా తినే వంటకాల్లో కుర్మా ఒకటి. దీనికి దేశంలోని టాప్-10 అత్యుత్తమ వంటకాల్లో పదోస్థానం లభించింది.