అన్నం వండేటప్పుడు ఈ పొరపాటు చేయకండి!

అన్నం వండేటప్పుడు.. ఎంత బియ్యానికి, ఎంత నీరు పొయ్యాలో చాలా మందికి తెలియదు.

సాధారణంగా.. ఒక గ్లాస్ బియ్యానికి, 2 గ్లాసుల నీరు పోస్తారు.

కొత్త రైస్ అయితే.. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసుల నీరు సరిపోతుంది.

బ్రౌన్ రైస్ అయితే... ఉడికించక ముందే, 45 నిమిషాలు నీటిలో నానబెట్టాలి.

బ్రౌన్ రైస్ ఒక గ్లాస్ బియ్యానికి, 3 గ్లాసుల నీరు అవసరం అవుతుంది.

చాలా మంది అన్నం వండేటప్పుడు.. మధ్య మధ్య 3, 4 సార్లు కదుపుతారు. అలా చెయ్యకూడదు.

అన్నం వండేటప్పుడు మధ్యలో కదిపితే.. అన్నం పేస్టులా, ముద్దలా తయారవుతుంది.

సిమ్‌లో లేదా చిన్న మంటపై అన్నాన్ని వండితే, అన్నం బాగా ఉడుకుతుంది.

ఎలక్ట్రిక్ కుక్కర్‌లో వండేటప్పుడు.. నీరు ఎంత పొయ్యాలో కచ్చితమైన కొలతలు పాటించాలి.

తగినంత నీరు పొయ్యకపోతే, అన్నం సరిగా ఉడకదు. అది తింటే, కడుపునొప్పి రాగలదు.

బియ్యం బస్తా తెచ్చాక, ముందుగా కొద్దిగా రైస్ టెస్ట్ చేసి, ఆ ప్రకారం వండుకోవడం మేలు.