సూపర్ అభిషేక్

టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన ఎంట్రీని ఘనంగా చాటాడు.

తొలి టి20లో డకౌట్ అయిన అతడు.. రెండో టి20లో మాత్రం కసితీరా బాదాడు.

జింబాబ్వేతో జరిగిన రెండో టి20లో సెంచరీతో కదం తొక్కాడు.

కేవలం 47 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు.. 8 సిక్సర్లు ఉండటం విశేషం.

ఈ క్రమంలో అభిషేక్ శర్మ పలు రికార్డులను అందుకున్నాడు.

భారత్ తరఫున అంతర్జాతీయ టి20ల్లో అతి తక్కువ ఇన్నింగ్స్ ల్లో సెంచరీ చేసిన బ్యాటర్ గా నిలిచాడు.

అభిషేక్ శర్మ తన రెండో ఇన్నింగ్స్ లోనే అంతర్జాతీయ టి20ల్లో సెంచరీ బాదాడు.

దీపక్ హుడా (3 ఇన్నింగ్స్ లు), కేఎల్ రాహుల్ (4 ఇన్నింగ్స్ లు) అభిషేక్ తర్వతి స్థానాల్లో ఉన్నారు.

ఈ ఏడాది టి20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ గా అభిషేక్ నిలిచాడు.

18 టి20 మ్యాచ్ ల్లో 50 సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మను అధిగమించాడు.

రోహిత్ శర్మ 25 మ్యాచ్ ల్లో 46 సిక్సర్లు బాదాడు.