ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు..

ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్‌న్యూస్. 

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 

మేనేజ్‌మెంట్ ట్రైనీ (MT) పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. 

ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జులై 5న ప్రారంభమైంది. 

లాస్ట్ డేట్ జులై 25. అధికారిక వెబ్‌సైట్ sailcareers.com లో అప్లై చేసుకోవచ్చు. 

సెయిల్ మొత్తం 249 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది.

ఏదో ఒక స్పెషలైజేషన్‌తో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. 

వీరికి గేట్ 2024 స్కోర్ తప్పనిసరి. 

జనరల్, OBC (NCL), EWS అభ్యర్థులు రూ.700 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

SC, ST, PwBD, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులు రూ. 200 పే చేయాలి.

పూర్తి వివరాల కోసం https://www.sail.co.in/ ఓపెన్ చేయండి. 

జీతం రూ.60,000- రూ.1,80,000 వరకు ఉంటుంది.