భూమిపై పెద్ద గ్రహశకల బిలాలు ఇవే!

భూమిపై అతిపెద్ద గ్రహశకల బిలం.. దక్షిణ ఆఫ్రికాలోని రెడెఫోర్ట్ (Vredefort)లో ఉంది. ఇది 160 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంది.

2వ అతి పెద్ద గ్రహశకల బిలం మెక్సికోలని చిక్స్‌లబ్ (Chicxulub)లో ఉంది. ఇది 150 కి.మీ విస్తీర్ణంతో ఉంది.

3వ భారీ గ్రహశకల బిలం కెనడాలోని సడ్బరీలో ఉంది. దీని విస్తీర్ణం 130 కిలోమీటర్లు. 

4వ పెద్ద గ్రహశకల గొయ్యి రష్యాలోని పోపిగయ్‌లో ఉంది. దీని విస్తీర్ణం 100 కిలోమీటర్లు. 

5వ స్థానంలో కెనడాలోని మనికోగాన్‌లో, 100 కిలోమీటర్లతో ఉన్న గ్రహశకల బిలం నిలిచింది.

6వ స్థానంలో ఆస్ట్రేలియాలోని ఆక్రామాన్‌లో ఉన్న బిలం చేరింది. దీని విస్తీర్ణం 90 కిలోమీటర్లు

7వ స్థానం దక్షిణ ఆఫ్రికాలోని మోరోక్వెంగ్‌ బిలానిది. ఇది 70 కి.మీ విస్తీర్ణం కలిగివుంది.

8వ పొజిషన్‌లో రష్యాలోని కారాలో ఉన్న గ్రహశకల బిలం నిలిచింది. ఇది 65 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంది.

అమెరికాలోని బీవర్‌హెడ్‌లో ఉన్న బిలం 9వ స్థానంలో ఉంది. దీని విస్తీర్ణం 60 కిలోమీటర్లు

10వ స్థానంలో ఆస్ట్రేలియాలోని తూకూనూకాలోని బిలం చేరింది. ఇది 55 కి.మీ విస్తీర్ణంతో ఉంది.

44వ స్థానంలో ఇండియాలోని 11 కి.మీ విస్తీర్ణం గల గ్రహశకల బిలం చేరింది. ఇది మధ్యప్రదేశ్‌లోని ధలాలో ఉంది.