రూ.75 లక్షల పురుగు.. ముట్టుకుంటే లక్షాధికారులే!

మీకు ప్రపంచంలో ఓ ఖరీదైన పురుగు ఉందని తెలుసా? దీని ధర తెలిస్తే షాక్ అవ్వడం పక్కా..!

ప్రపంచంలో అత్యంత ఖరీదైన పురుగు ‘స్టాగ్‌ బీటిల్‌’. దీని ధర అక్షరాల రూ.75 లక్షలు.

ఈ అరుదైన పురుగును అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు.

ఈ పురుగును ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే ఆ వ్యక్తిని లక్షాధికారిని చేస్తుందట. 

ఇది కేవలం చెక్కను తిని జీవించే జాతికి చెందినది.

లండన్‌కు చెందిన ‘నేచురల్‌ హిస్టరీ మ్యూజియం’ నివేదకల ప్రకారం.. ఈ పురుగు బరువు 2-6 గ్రాముల మధ్యలో ఉంటుందట.

ఇది దాదాపు 3-7 సంవత్సరాలు జీవిస్తుంది. 

మగపురుగులు 35-70 మిల్లీమీటర్ల పొడవు, ఆడపురుగులు 30-50 ఎంఎం పొడవు ఉంటాయి.

ఈ కీటకాల్లో ఔషధగుణాలు ఉన్నందున చికిత్సల్లోనూ వాడతారు. 

ఈ పురుగులకు ఉన్న కొండీలు.. మగ జింకల కొమ్ములను పోలి ఉండటంతో వీటికి ‘స్టాగ్‌ బీటిల్స్‌’ అనే పేరొచ్చింది.

ఇవి సంతానోత్పత్తి సమయంలో ఆడపురుగులతో జత కట్టేందుకు ఈ కొండీలను పరస్పరం కొడుతూ విచిత్రమైన చప్పుడు చేస్తాయి.