పెళ్లి కూతురిగా రాధిక.. చూడడానికి రెండు కళ్లూ చాలవు!

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ఎండీ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్‌తో వివాహం శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది.

ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది.

ఈ క్రమంలో పెళ్లి కూతురు రాధిక వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

గుజరాతీ సాంప్రదాయంలో రాధిక తయారయ్యారు.

ఎరుపు, తెలుపు వర్ణాల్లో మెరుస్తున్న లెహంగాను ధరించారు.

ఈ గుజరాతీ సాంప్రదాయ లెహంగాను అబుజనీ సందీప్ ఖోస్లా రూపొందించారు.

తన కుటుంబానికి చెందిన ఆభరణాలను ఆమె ధరించారు.

వీటిని ఆమె తల్లి, సోదరిలు వారి వివాహాలకు ధరించారు.

అనంత్-రాధిక రిసెప్షన్ శనివారం జరగనుంది.

ఈ పెళ్లి వేడుకకోసం దేశవిదేశాలనుంచి సెలబ్రిటీలు వచ్చారు.

సినీ స్టార్స్, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఉన్నారు.