కింద కూర్చొని తినడం మంచిదేనా?

మారుతున్న కాలాన్ని బట్టి భోజనం చేసే విధానం కూడా మారుతూ వస్తోంది.

ఒకప్పుడు ఎక్కువ మంది నేల మీద కూర్చొని భోజనం చేసేవారు.

ఇప్పుడు కొందరు మాత్రమే దీన్ని అనుసరిస్తున్నారు.

నిజానికి నేల మీద కూర్చొని భోజనం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. 

ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

భోజనం తినడానికి ముందుకు వంగినప్పుడు పొట్ట కండరాలు చురుగ్గా పనిచేసి పొట్టలో ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి.

దీని వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.

శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడి కొవ్వు తగ్గుతుంది. 

కింద కూర్చొని తినడం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

కింద కూర్చుని తింటే వెన్నెముక నిటారుగా ఉంటుంది. 

కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. శరీరం అంతా రక్తప్రసరణ జరుగుతుంది.