ఉచిత శిక్షణ.. ఆపై ఉద్యోగం..

నేటి సమాజంలో ఏ పని జరగాలన్నా కంప్యూటర్ రంగం అనేది కీలకం.

చిన్న మార్టులోపని చేయాలంటే కూడ కంప్యూటర్ బేసిక్ అన్న తెలిసిండాలి.

చాలా మంది చదువుతారు, రాస్తారు కానీ ఈ కంప్యూటర్ రంగంలో బేసిక్స్ కూడా తెలిసి ఉండదు. 

ఎలాంటి సమస్యలు ఎదురు పడకుండా ఉండాలి అంటే కంప్యూటర్ శిక్షణ అనేది ప్రతి వ్యక్తికి అవసరం. 

ఇదే దిశలోనే ఉచితంగా కంప్యూటర్ విభాగంలో ట్యాలీ కోర్స్ 35 రోజులు క్రమంగా నేర్పిస్తున్నారు. 

అన్నమయ్య జిల్లా, కడప కోటిరెడ్డి సర్కిల్ ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్యాలీలో ఉచిత శిక్ష ఇస్తున్నారు. 

టెన్త్ పాస్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పాస్/ఫెయిల్ అయి 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు అర్హులన్నారు. 

శిక్షణానంతరం వివిధ సంస్థల్లో కనీస వేతనం రూ.15వేలతో ఉపాధి కల్పిస్తారన్నారు. 

ఇతర వివరాలకు 90004 87423 నంబరులో సంప్రదించాలన్నారు.