PM Kisan: రైతులకు అకౌంట్లోకి రూ.9,500..

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడతను ప్రధాని మోదీ గత నెలలో విడుదల చేశారు.

వార్షిక మొత్తం రూ.6,000లో ఈ విడత రూ.2,000ను 9 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలకు ప్రధాని బదిలీ చేశారు.

ఇప్పుడు వచ్చే నెలలో బదిలీ కానున్న 18వ విడత కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.

కిసాన్ సమ్మాన్ నిధిని పొందడానికి, e-KYCని కలిగి ఉండటం అవసరం.

PM కిసాన్ వెబ్‌సైట్ ప్రకారం.. PM కిసాన్‌లో నమోదు చేసుకున్న అర్హులైన రైతులకు eKYC తప్పనిసరి.

OTP ఆధారిత eKYC ప్రధాన మంత్రి కిసాన్ పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది.

బయోమెట్రిక్ ఆధారిత eKYC కోసం రైతులు తమ సమీప కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని కూడా సంప్రదించవచ్చు.

చిన్న , సన్నకారు రైతులు పీఎం కిసాన్ నిధు యోజనకు అర్హులు.

వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్న రైతు కుటుంబాలు ఈ పథకం ప్రయోజనం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అంతే కాకుండా.. లబ్ధిదారుడు భారతీయ పౌరుడై ఉండాలి.

తెలంగాణ ప్రభుత్వం వర్షాకాల పంట నుంచి రైతుభరోసా డబ్బులను జమ చేస్తామని తెలిపారు.

దీంతో రైతుల ఖాతాల్లో రూ.7,500తో కలుపుకుంటే రూ.9,500 జమ కానున్నాయి.