ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన APSRTC.. 

ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రయాణికులకు APSRTC గుడ్ న్యూస్ తెలిపింది.

ప్రయాణికుల సౌకర్యార్థం కర్నూలు జిల్లా నుంచి బెంగుళూరుకు ప్రత్యేక స్లీపర్ బస్సు సర్వీస్ ను ప్రారంభించారు.

కొత్తగా అత్యాధునిక స్టార్ లైనర్ (నాన్ ఏసీ స్లీపర్) బస్సును ప్రారంభించినట్లు RTC అధికారులు తెలిపారు.

ఈ బస్సు ప్రతి రోజు కర్నూలులో రాత్రి 10.00 గంటలకు బయలుదేరుతుంది.

బెంగళూరుకు ఉదయం 05.15 గంటలకు చేరుకుంటుందని తెలిపారు.

అదే విధంగా బెంగళూరులో రాత్రి 10.00 గంటలకు బయలుదేరి.. కర్నూలుకు ఉదయం 05.15 గంటలకు చేరుకుంటుంది.

ఇందుకు సంబంధించి చార్జీ ఒక్కొక్కరికి కింద బెర్తు రూ.920, పై బెర్తు రూ.850 ఉంటుంది.

ఆన్ లైన్ apsrtconline.in ద్వారా అడ్వాన్సు రిజర్వేషన్ చేసుకోవచ్చని తెలిపారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.