భూమిపై వేటాడే అత్యంత ప్రాణాంతక 10 ప్రాణులు

ఈ జాబితాలో అడవుల్లో జీవించే వన్యప్రాణులతోపాటూ.. వేరేవి కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

గ్రేట్ వైట్ షార్క్ - ఇవి అన్ని మహా సముద్రాల్లో కనిపిస్తాయి. ఇవి బాగా వేటాడగలవు. నీటిలోంచి పైకి వస్తూ, సీల్స్‌ని ఇట్టే పట్టేస్తాయి.

ఉప్పునీటి మొసళ్లు - ఇవి సడెన్‌గా దాడి చేస్తాయి. వీటి దవడలు చాలా బలంగా ఉంటాయి. ఇవి అగ్నేయ ఆసియా, ఉత్తర ఆస్ట్రేలియా జలాల్లో ఉంటాయి.

ఆఫ్రికా లయన్ - సహారా అడవుల్లో జీవించే ఈ సింహాలు.. గుంపుగా వేటాడగలవు. జీబ్రాలు, గేదెలను ఇట్టే వేటాడి తినేస్తాయి.

బెంగాల్ టైగర్ - ఇండియాలో పెద్ద పులులు ఇవే. మెరుపువేగంతో దాడి చెయ్యగలవు. ఇవి భూమిపై అత్యంత ప్రాణాంతక జీవులుగా ఉన్నాయి. 

ధృవపు ఎలుగుబంటి - ఇవి చాలా పెద్ద సైజులో ఉంటాయి. ఇవి ఆర్కిటిక్ సర్కిల్‌లో సీల్స్‌ని చంపి తింటాయి. మైనస్ డిగ్రీల్లోనూ చక్కగా జీవిస్తాయి.

కొమొడొ డ్రాగన్ - బల్లుల్లో ఇవే పెద్దవి. ఇవి కొరికినప్పుడు నోటిలోని విషం, బ్యాక్టీరియా వల్ల శత్రువు దొరికిపోతుంది. ఇండొనేసియాలో ఇవి కనిపిస్తాయి.

గ్రిజ్జీ బేర్ - ఉత్తర అమెరికాలో కనిపించే గ్రిజ్జీ ఎలుగుబంట్లు శక్తిమంతమైనవి. గంటకు 30 మైళ్ల వేగంతో పరుగెట్టగలవు. మూస్, ఎల్క్ వంటి వాటిని తమ పదునైన పంజాలతో వేటాడి తింటాయి.

కిల్లర్ వేల్ (ఆర్కా) - ఈ రకం తిమింగలాలు తెలివైనవి. గుంపుగా వేటాడి సీల్స్, చేపల్ని తింటాయి. సముద్రాల్లో ఇవే టాప్ ప్రిడేటర్లు.

కేప్ బఫెలో - ఇవి సహారా అడవుల్లో ఉంటాయి. చాలా ప్రమాదకరమైనవి. అంచనాలకు అందవు. బలం ఎక్కువ. బలమైన కొమ్ములతో కుమ్మేస్తాయి.

గోల్డెన్ ఈగిల్ - ఈ గద్దలు ప్రపంచమంతా ఉంటాయి. వీటి చుపు పవర్‌ఫుల్. వేగంగా ఎగురుతాయి. గాలిలో వేటాడటంలో వీటికి తిరుగులేదు.