జంక్ ఫుడ్.. జర జాగ్రత్త!
శరీరానికి షుగర్, సాల్ట్.. సరిపడా మాత్రమే అందాలి. ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమే.
జంక్ ఫుడ్‌లో చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
జంక్ అంటే చెత్త. జంక్ ఫుడ్ అంటే చెత్త ఆహారం అని అర్థం. దీన్ని స్లో పాయిజన్ అని కూడా అంటున్నారు.
జంక్ ఫుడ్ వల్ల భారతీయులు లావైపోతున్నారు. చిన్నప్పటి నుంచే ఈ సమస్య కనిపిస్తోంది.
ఇండియన్ సూపర్ మార్కెట్లలో రెడీ టు ఈట్, ప్రాసెసింగ్ ఫుడ్ బాగా లభిస్తోంది.
ఇళ్లలో వండుకునే టైమ్ లేక ప్రజలు ఈ ఫాస్ట్ ఫుడ్‌ని ఎక్కువగా తినేస్తున్నారు.
ఫుడ్ డెలివరీలు కూడా ఎక్కువైపోయాయి. బయటి ఆహారం ఎప్పటికీ ప్రమాదమే!
జంక్‌ఫుడ్ వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్, బీపీ, పైల్స్ ఇంకా చాలా రకాల అనారోగ్యాలు వస్తున్నాయి.
ఇదివరకు స్నాక్స్‌గా పకోడీ, బజ్జీ, పుణుగులు, ముంత మిక్చర్, పల్లీలు, మరమరాల లాంటివి తినేవారు.
ఇప్పుడు పిజ్జా, బర్గర్, శాండ్విచ్, ఐస్‌క్రీమ్, కేకులు, కుకీలు, చాక్లెట్లు వంటివి ఎక్కువగా తింటున్నారు.
ప్రపంచ దేశాలు ఏటా జులై 21న జాతీయ జంక్ ఫుడ్ దినం నిర్వహించి, చెత్త ఆహారం తినవద్దని సూచిస్తున్నాయి.
More
Stories
ఈ 5 వస్తువులను ఊరికే తీసుకోకండి, ఇవ్వకండి.
వుడ్ పెయింట్స్ అంటే ఏంటి?
పాము కాటు వేస్తే..