Jobs: 50 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్.. 

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలన్నదే ప్రజా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని సీఎం రేవంత్ అన్నారు.

ఇటీవల "రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం"  కార్యక్రమాన్ని ప్రారంభించారు.

దీని ద్వారా యూపీఎస్సీ సివిల్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు రూ.లక్ష అందించనున్నారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే చిత్తశుద్ధితో 30 వేల ఖాళీలను భర్తీ చేసినట్లు పేర్కొన్నారు.

ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన జాబ్ క్యాలండర్‌ను ప్రకటించబోతున్నామని చెప్పారు.

ప్రతి ఏటా మార్చి 31 లోగా అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను తెప్పిస్తామన్నారు.

జూన్ 2 నాటికి నోటిఫికేషన్న్ ఇచ్చి  ఇచ్చి డిసెంబర్ 9 లోపు నియామక పత్రాలను అందజేస్తామన్నారు.

అయితే ఈ క్యాలెండర్ లో దాదాపు 50 వేల పోస్టులతో నోటిఫికేషన్స్ విడుదల కానున్నాయి.

 ఇప్పటి వరకు ప్రభుత్వానికి అందిని ఖాళీ పోస్టుల్లో.. మోడల్ స్కూల్స్ లో 707 పోస్టులు ఉన్నాయి.

డిగ్రీ కాలేజీల్లో 600 పోస్టులు, డైట్ కాలేజీలు, ఎస్సీఈఆర్టీ లో 110 పోస్టులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

వీటితో పాటు.. వివిధ శాఖల్లో ఖాళీ పోస్టులు సంఖ్యపై త్వరలోనే స్పష్టత రానుంది.

డీఎస్సీ ద్వారా మొత్తం 6 వేల పోస్టులను భర్తీ చేయనున్నారు.