Rythu Runamafi: రుణమాఫీ కాని రైతులకు భారీ శుభవార్త.. 

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా కూడా ఏ ప్రభుత్వం ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేయలేదు.

ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం జులై 18న ప్రారంభించింది.

మొదట లక్ష లోపు రుణం తీసుకున్న రైతుల ఖాతాల్లో రుణ మాఫీ చేశారు.

అర్హులైన 11 లక్షల 50 వేల మంది రైతులకు రూ.6098 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసింది.

లక్ష నుంచి లక్షన్నర రుణం ఉన్న రైతుల ఖాతాల్లో ఈ నెలాఖరుకల్లా జమ కానున్నాయి.

ఇక మిగిలిన రెండు లక్షల వరకు ఉన్న రుణాన్ని ఆగస్టు 15లోపు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

అయితే దీనిపై కొందరు కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు.

రుణమాఫీపై రైతులకు ఎలాంటి అపోహలు వద్దన్నారు.

రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందన్నారు.  రుణం తీసుకున్న ప్రతీ రైతు బ్యాంక్ అకౌంట్ నంబర్లు తమ దగ్గర ఉన్నాయన్నారు.

రుణమాఫీ కాని వారికి ఎందుకు కాలేదో తెలుసుకొని.. వారికి ఎప్పుడు అవుతాయో తొందర్లోనే క్లారిటీ ఇస్తామన్నారు.

ప్రతీ ఒక్క రైతుకు రూ.2లక్షల వరకు రుణమాఫీ అందుతుందని మరో సారి స్పష్టం చేశారు.