ఇంటి ముందు చెప్పులు ఇలా ఉంటే అరిష్టం..!

ఇంటి ప్రధాన ద్వారాన్ని గౌరీదేవిగా భావిస్తారు 

అందుకే గడపలకు పసుపు రాసి కుంకుమ పెడతారు. 

గడప ముందు చెప్పులు విప్పకూడదు, చీపురు పెట్టకూడదు. 

కొందరు ద్వారం వద్ద చెప్పులు నిర్లక్ష్యంగా విడుస్తారు. 

అటువంటప్పుడు చెప్పులు తిరగబడుతుంటాయి. 

చెప్పులు ఇలా తిరగబడి ఉండకూడదని చెబుతున్నారు పండితులు. 

ఇలా చెప్పులు విడిస్తే ఆ ఇంట ప్రతికూల ప్రభావాలుంటాయంట. 

వాస్తు శాస్త్రంలో బూట్లు, చెప్పులు వంటివి పాదరక్షలు సరైన స్థలంలో ఉంచాలి. 

లేకపోతే ఇంట్లో వారికి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. లక్ష్మీదేవికి కోపమొస్తుంది.. ఆర్థిక సమస్యలతో తప్పవు. 

చెప్పులు తలకిందులుగా ఉంటే దుష్టప్రభావం అధికంగా ఉంటుంది. 

ఈ కథనం పండితులు చెప్పిన దాని ప్రకారం రాసినది.. దీనిని న్యూస్ 18 ధృవీకరించడం లేదు