ఈ 7 జ్యూస్‌లతో మీకు సూపర్ బ్రెయిన్

ఈ రోజుల్లో మనం బ్రెయిన్‌ని కాపాడుకోవాలి. బ్రెయిన్‌పై ఒత్తిడి పెరుగుతోంది.

నిద్ర సరిగా లేకపోవడం, అతిగా మెదడును వాడుకోవడం వల్ల బ్రెయిన్ అలసిపోతోంది.

మరి బ్రెయిన్‌ని ఆరోగ్యంగా ఉంచేందుకూ, ఒత్తిడి తగ్గించేందుకూ తాగాల్సిన జ్యూస్‌లు ఏవో చూద్దాం.

బ్లూ బెర్రీ జ్యూస్: ఇందులోని ఫ్లేవనాయిడ్స్ బ్రెయిన్‌ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

దానిమ్మ జ్యూస్: ఈ జ్యూస్‌లో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి బ్రెయిన్ మెమరీ పవర్ పెంచుతాయి. 

బీట్‌రూట్ జ్యూస్: ఈ జ్యూస్‌లోని నైట్రేట్స్ వల్ల బ్రెయిన్ తేడాలను బాగా గుర్తించే శక్తి పెరుగుతుంది.

క్యారెట్ జ్యూస్: ఈ జ్యూస్‌లో ల్యూటోలిన్ ఉంటుంది. ఇది బ్రెయిన్‌ని కాపాడుతుంది. 

పాలకూర జ్యూస్: ఇందులోని ల్యూటీన్, బ్రెయిన్‌లో విష వ్యర్థాలను తరిమేస్తుంది.

ఆరెంజ్ జ్యూస్: ఇందులోని విటమిన్ సీ, బ్రెయిన్ ఒత్తిడిని తగ్గిస్తుంది.

కాలే జ్యూస్: ఇందులోని యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ ఏ, సీ, బ్రెయిన్‌ని అన్ని రకాలుగా కాపాడుతుంది.

మీ ఆరోగ్య నిపుణుల సలహాలను పాటిస్తూ, ఈ జ్యూస్‌లు తీసుకోవచ్చు.