యష్  'టాక్సిక్‌'లో 5గురు హీరోయిన్‌లు..!

'కేజీఎఫ్-2' వంటి బ్లాక్ బస్టర్ హిట్టు తర్వాత యష్ దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని 'టాక్సిక్' అనే సినిమా చేస్తున్నాడు.

మలయాళ దర్శకురాలు గీతూ మొహన్ దాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తుంది. 

ఈ సినిమాలో ఏకంగా 5 గురు హీరోయిన్‌లు నటించబోతున్నట్లు సమాచారం. 

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఈ సినిమాలో కీలక రోల్ ప్లే చేస్తున్నట్లు సమాచారం. 

అదే విధంగా లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో యష్‌కు అక్కగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. 

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ యష్‌కు జోడీగా నటించబోతుందట. 

బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. 

కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ కూడా ఓ కీలక రోల్‌లో కనిపించనుందట. 

ఇలా మొత్తంగా టాక్సిక్ సినిమా కోసం 5 భామలు నటించబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. గోవా డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది. 

అంతేకాకుండా యష్ క్యారెక్టర్ ఈ సినిమాలో కాస్త నెగెటీవ్ గా కనిపించనున్నట్లు సమాచారం.