ఆ స్టార్ హీరోయిన్‌‌ను కొట్టానని బాధపడుతున్న అడివిశేష్..!

థ్రిల్లర్‌ సినిమాలకు పెట్టిన పేరు అడివి శేష్. ఈ కుర్ర హీరో నుంచి సినిమా వస్తుందంటే అది పక్కా హిట్టే అనే ముద్ర పడిపోయింది. 

నిజానికి హీరోగా ఆయన నిలబడడానికి ముఖ్య కారణం కూడా థ్రిల్లర్‌ జానర్‌ సినిమాలు చేయడం వల్లనే. 

ప్రస్తుతం అడివిశేష్ తన థ్రిల్లర్‌ జానర్‌లో కంఫర్ట్‌గా సినిమాలు చేసుకుంటూ వరుసగా హిట్లు కొడుతున్నాడు. 

గతేడాది ద్వితియార్థంలో మేజర్‌తో పాన్‌ ఇండియా రేంజ్‌లో హిట్టు కొట్టిన అడివిశేష్‌.. అదే ఏడాది చివర్లో హిట్టు-2తో మరో బ్లాక్‌బస్టర్‌ సాధించాడు.

ఈ నటుడు.. తాజాగా ఓ సీన్ ఇష్టం లేకుండా చేశానని రీసెంట్‌గా ఓపెన్ అయ్యాడు. 

అడివి శేష్ కెరీర్ ప్రారంభంలో.. పంజా, బలుపు వంటి సినిమాల్లో మీ నెగెటీవ్ రోల్స్ చేశాడు. 

కాగా బలుపులో ఓ సీన్‌లో శృతిహాసన్‌ జుట్టు పట్టుకు లాక్కెళ్లిన సీన్ ఒకటుంది.

ఆ సీన్ ఇష్టంలేకుండానే.. అడవిశేష్ చేసినట్లు తాజాగా చెప్పుకొచ్చాడు. 

అంతేకాకుండా ఆ సీన్ చేసేటప్పుడు తన మీద తనకు అసహ్యం వేసిందని, తను ఇలాంటి రోల్స్ చేస్తున్నానని అని ఫీలైనట్లు చెప్పుకొచ్చారు.

అయితే ఆ తర్వాతే కసి పెరిగి బ్యాక్ టు బ్యా్క్ 5 హిట్లు కొట్టానని కూడా చెప్పాడు. 

బలుపు సినిమా తనలో చాలా మార్పులు తీసుకొచ్చిందని చెప్పాడు.