ప్రభాస్ సినిమాలో హీరోయిన్‌గా శ్రీదేవి మూడో కూతురు..!

ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నంత హ్యాపీగా ఏ హీరో అభిమాని లేడేమో. 

గతేడాది సలార్‌తో అరివీర భయంకర హిట్టు కొట్టిన ప్రభాస్.. రీసెంట్‌గా కల్కీతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు.

హిట్టంటే మళ్లీ ఆశా మాశీ హిట్టు. కొడితే బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్ల రీసౌండ్ వినిపించింది.

సినిమా రిలీజై 28 రోజులు కంప్లీట్ అయినా.. ఇంకా దీని జోరు ఎక్కడా తగ్గలేదు. 

దానికి తోడు కొత్తగా రిలీజైన సినిమాలన్నీ యావరేజ్, డిజాస్టర్ టాక్‌లు తెచ్చుకోవడంతో.. కల్కీకి బాగా కలిసివస్తుంది.

ఈ సినిమా జోరు చూస్తుంటే ఫైనల్ రన్‌లో రూ.1200 కోట్లు కొల్లగొట్టేలానే కనిపిస్తుంది. 

ప్రస్తుతం ప్రభాస్ లైనప్ సాలిడ్‌గా ఉంది. అందులో హానురాఘవపూడితో పీరియాడిక్ సినిమా ఒకటి.

ఈ సినిమా కోసం పాకిస్థాన్ హీరోయిన్ సజల్ అలీని చిత్రయూనిట్ సంప్రదిస్తున్నట్లు స‌మాచారం.

కాగా ఈ బ్యూటీ శ్రీదేవి చివరి సినిమా మామ్‌లో ఈ బ్యూటీ నటించింది. ఇందులో శ్రీదేవి కూతురుగా నటించింది. 

మామ్ సినిమా ప్రమోషన్‌లలో శ్రీదేవి.. సజల్ నాకు మూడో సంతానం లాంటిదని, మరో కూతురని చెప్పింది.

ఇప్పటికీ ఈ బ్యూటీ శ్రీదేవి ఫ్యామిలీతో చాలా క్లోజ్‌గా ఉంటున్నట్లు ఇన్ సైడ్ టాక్.