అందాల ఆరబోతలో ఈమెకు సాటి ఎవరు లేరు మామ..!

సోషల్ మీడియా సెన్సేషన్ మాళవిక మోహనన్ ఒక్క పోస్ట్ పెట్టిందంటే చాలు కుర్రకారుకు నిద్ర కూడా పట్టదు. 

చూపు తిప్పుకోలేని అంద, చందాలతో అందరినీ తన వైపు చూసేలా చేస్తుంది మలయాళ కుట్టి మాళవిక మోహనన్.

ఎప్పటికప్పుడు ఘాటైన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతూ మురిపిస్తుంది ఈ బ్యూటీ. 

తాజాగా ఈ బ్యూటీ ఎరుపురంగు చీరలో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.

తరచూ ఘాటైన ఫోటోలు పోస్ట్ చేసే ఈ బ్యూటీ.. ఇప్పుడు మాత్రం చక్కటి చీరలో నడుమందాలు చూపిస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది.

దాంతో నెటీజన్లు అందానికే అసూయ పుట్టే అందం మాళవిక మోహన్‌ది అంటూ కవిత్వాలతో కామెంట్స్ పెడుతున్నారు.

దశాబ్దం కిందట మలయాళంలో వచ్చిన 'పట్టం పోలే' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దు గుమ్మ. 

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమాకు అలగప్పన్ దర్శకుడు.

ఈ సినిమా తర్వాత కన్నడ, తమిళం, హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్‌లు చేసింది. 

అయితే ఈ బ్యూటీ ర‌జ‌నీకాంత్‌తో కలిసి చేసిన 'పేట' సినిమాతో మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. 

ఈ సినిమా త‌ర్వాత త‌మిళ అగ్ర న‌టుడు విజ‌య్ న‌టించిన 'మాస్ట‌ర్' చిత్రంలో హీరోయిన్‌గా న‌టించి మంచి విజ‌యం అందుకుంది. 

ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ప్రభాస్ తో కలిసి 'రాజాసాబ్' సినిమా చేస్తుంది.