మీకు ఉసిరికాయ తినే అలవాటు ఉందా..?

ఉసిరికాయను ఔషధాల గణ అని అంటారు.

ఉసిరికాయలో చాలా రకాల పోషకాలు ఉంటాయి.

ఉసిరిలో అనేక రకాల విటమిన్లు ఉంటాయి. 

దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా రకరకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.

ఉసిరికాయలో విటమిన్ బి2, విటమిన్ బి6, విటమిన్ సి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.

ఉసిరికాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది.

ఉసిరి శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది. దీని వల్ల చర్మం క్లియర్ అవుతుంది.

ఉసిరి జీర్ణక్రియను మెరుగుపరచడానికి, ఆమ్లత్వం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. 

ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. 

ఉసిరికాయ ఎముకలు, కళ్లకు ఎంతో మేలు చేస్తోంది.

వృద్ధాప్యం, జుట్టు నెరసిపోకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.