ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలు ఇవే..

గ్లోబల్ పీస్ ఇండెక్స్ దేశాల భద్రత, శాంతి స్థాయిని బట్టి అంచనా వేస్తారు.

నేరాల రేట్లు, రాజకీయ స్థిరత్వం, సామాజిక ఐక్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

GPI ఆధారంగా ఈ దేశాలు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా ర్యాంక్ చేయబడతాయి.

ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ప్రతి సంవత్సరం ఈ అధ్యయనాన్ని ప్రచురిస్తుంది.

ఏవి సురక్షితమైనవి, అత్యంత ప్రమాదకరమైనవి అని తెలుసుకోవడానికి ఈ అధ్యయనం దేశాలను పరిశోధిస్తుంది.

ఈ దేశాల లిస్ట్‌ను గ్లోబల్ పీస్ ఇండెక్స్ వెల్లడించింది. 

ఐస్‌ల్యాండ్: తక్కువ నేరాల రేటు, అధిక సామాజిక సమన్వయానికి ప్రసిద్ధి చెందిన ఐస్‌లాండ్ ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన దేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

డెన్మార్క్: డెన్మార్క్‌లో ఉన్నత జీవన ప్రమాణాలు, బాగా పనిచేసే సంస్థలు, స్థిరమైన రాజకీయ వ్యవస్థలు కారణంగా అత్యంత సురక్షితమైన దేశంగా గుర్తించబడింది.

ఐర్లాండ్: ఐర్లాండ్‌లో ప్రజలు స్నేహపూర్వక స్వభావం, తక్కువ నేరాల రేటు, స్థిరమైన రాజకీయ వాతావరణాన్ని కలిగి ఉంది.

న్యూజిలాండ్: న్యూజిలాండ్ ప్రజలకు ఐక్యతలో ఉంటారు. దీంతో పాటుగా నేరాల రేటు కూడా చాలా తక్కువ.

ఆస్ట్రియా: ఆస్ట్రియా అందమైన ప్రాంతాలతో పాటుగా ఆహ్లాదకరమైన వాతావరణం, నేరల రేటు తక్కువగా ఉంటుంది.