టైట్ బ్రా ధరించడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా..?

బ్రా ధరించడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని నమ్మేవాళ్లూ ఎక్కువే.

బ్రా ధరించడం అసౌకర్యంగా భావించే మహిళలూ ఉంటారు.

బ్రా వేసుకోపోతే మహిళల శరీర నిర్మాణంలో మార్పులు వచ్చి, స్తనాలు వదులు అవుతాయని మరికొందరు తికమకపడుతుంటారు.

బ్రా ధరించడం లేదా ధరించకపోవడం స్త్రీ శరీర ఆకృతిని నిజంగా మారుస్తుందా?

మహిళలు తమ శరీరాన్ని అర్థం చేసుకోవాలని, రొమ్ములపై అవగాహన కలిగి ఉండాలని గైనకాలజిస్ట్‌లు అంటున్నారు.

బ్రా వేసుకోపోతే మహిళల శరీర నిర్మాణంలో మార్పులు వచ్చి, స్తనాలు వదులు అవుతాయని మరికొందరు తికమకపడుతుంటారు.

లాలాజలాన్ని స్రవించడానికి నోటిలో కొన్ని గ్రంథులు ఉన్నట్లే, పాలు స్రవించడానికి రొమ్ములలో గ్రంథులు ఉంటాయి.

క్షీరగ్రంథులు వయసుతో పాటు క్షీణిస్తాయి. వయసు పెరిగేకొద్దీ స్తనాలు కుంగిపోవడం సహజం. అంతే తప్ప, బ్రా ధరించకపోతే సాగిపోతాయని కాదు.

స్తనాలను బ్రా సరైన స్థానంలో నిలబెడుతుంది. వెన్నునొప్పికి దూరంగా ఉండవచ్చు.

తాత్కాలిక సౌకర్యం కోసమే బ్రా ధరిస్తామన్న విషయాన్ని మహిళలు అర్థం చేసుకోవాలి.

బాగా బిగుతుగా ఉండే బ్రా ధరిస్తే రొమ్ములో నొప్పి రావచ్చు. అందుకే, సరైన సైజు బ్రాలను ఎంచుకుని ధరించాలి.