వెబ్ సిరీస్ కోసం రూ.40 కోట్లు తీసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్..!

దశాబ్దం కిందకి వెళ్తే పది కోట్లు తీసుకుంటున్న హీరో అంటే.. వామ్మో అనుకునేవాళ్లం. 

అలాంటిది ఇప్పుడు ఒక్క హీరోకే వందల కోట్ల రెమ్యునరేషన్‌లు ఇస్తున్నారు. 

ఇక హీరోయిన్‌ల విషయంలో గతంలో పారితోషికాలు హీరోల రెమ్యునరేషన్‌లో సగం ఉండేవి.

స్టార్ హీరోయిన్ అయితే.. కోటి వరకు రెమ్యునరేషన్ ఉండేది. 

అయితే ఇప్పుడన్నీ లెక్కలు మారిపోయాయి. హీరోయిన్‌లు కూడా హీరోల రేంజ్‌లో పారితోషికాలు అందుకుంటున్నారు. 

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సూత్రాన్ని ఇప్పటి హీరోయిన్‌లుగా బాగా పాటిస్తున్నారు.

కాగా బాలీవుడ్ బ్యూటీ ప్రియంక చోప్రా ఒక్కో సినిమాకు అక్షరాల రూ.40 కోట్లు తీసుకుంటుంది. 

ప్రస్తుతం ఈ బ్యూటీ వరుసగా హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. 

‘హెడ్స్ ఆఫ్ స్టేట్’, ‘ది బ్లఫ్’ అనే ఇంగ్లీష్ సినిమాలు చేస్తున్న ప్రియాంక చోప్రా, గత ఏడాది ‘సిటాడెల్’ అనే టీవీ సీరిస్‌లో నటించింది.

ఈ వెబ్ సిరీస్ కోసం ప్రియాంక చోప్రా రూ.40 కోట్లకి పైగా రెమ్యూనరేషన్ అందుకుందట.

ఈ బ్యూటీ రామ్ చరణ్‌తో కలిసి తుఫాన్ సినిమాలో నటించింది.