శ్రావణమాసంలో శివుడి అనుగ్రహం పొందాలంటే ఇలా చేయండి?

శ్రావణమాసంలో హిందువులందరూ దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తుంటారు.

శ్రావణ మాసంలోని సోమవారం రోజున ఈశ్వరుడిని ఆరాధిస్తారు.

ఉపవాస దీక్షను ఆచరిస్తూ అభిషేకాలు చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.

శ్రావణ సోమవారం రోజున ఏదైనా తీర్థయాత్ర లేదా గంగా నది నుంచి తెచ్చిన నీటితో శివ లింగానికి జలాభిషేకం చేయాలి. 

ఇలా చేసిన వ్యక్తులకు ఖచ్చితంగా మోక్షం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. 

శివలింగానికి నీటిని సమర్పించడం వల్ల మీ కుటుంబంలో ఆనందం, శాంతి పెరుగుతుంది..

శ్రావణ మాసంలో సోమవారం రోజున శివయ్యకు స్వచ్చమైన ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పించాలి. 

ఇలా చేయడం వల్ల మీకు ఆదాయం పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయి.

శ్రావణ సోమవారం రోజున శివయ్యకు చెరకు రసాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. 

శివ లింగానికి పాలు, పెరుగు, పంచదార కలిపి నైవేద్యంగా సమర్పించడం వల్ల తెలివితేటలు పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. 

అంతేకాదు మీ పిల్లల మెదడు కూడా చురుగ్గా మారుతుందని నమ్మకం.