చిన్నదా? పెద్దదా? ఇండియాలో ఏ కారు బెటర్?

బ్రిటీష్ వారు పరిపాలించడంతో మనం చాలా వరకూ బ్రిటన్‌ని అనుసరిస్తాం.

యూరప్ దేశాల్లో చిన్న కార్లే ఎక్కువగా కొంటారు. 

అక్కడ జనాభా ఎక్కువ, స్థలాలు తక్కువ కావడంతో చిన్న కార్లకే ప్రాధాన్యం.

అమెరికాలో భూభాగం ఎక్కువ కావడంతో.. పెద్ద కార్లు ఎక్కువగా కొంటారు.

ఇండియా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం.

ఇండియాకి చిన్న కార్లే అన్ని విధాలా బెటర్. అందుకే వాటినే ఎక్కువగా కొంటున్నారు.

చిన్న కార్లు ట్రాఫిక్‌లో త్వరగా వెళ్తాయి. టర్న్ తిప్పడం తేలిక, పార్కింగ్‌కీ అనుకూలం.

పెట్రోల్ అయినా, డీజిల్ అయినా, బ్యాటరీ అయినా చిన్న కార్లతోనే సేవింగ్ ఎక్కువ.

ఎలక్ట్రిక్ కార్లలోనూ చిన్న సైజువే ఎక్కువగా ఉన్నాయి. డిమాండ్‌ని బట్టే సప్లై ఉంది.

చిన్న కార్లలోనూ SUVలు వచ్చేశాయి. కాబట్టే ప్రజలు స్మాల్ ఈజ్ బ్యూటీఫుల్ అంటున్నారు.

మీరు పెద్ద కారు కొనాలనుకుంటే, ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మేలు!