అందంగా ఉందని.. ఒలింపిక్స్ నుంచి గెంటేశారు!

పారిస్ ఒలింపిక్స్‌లో ఓ క్రీడాకారిణికి ఊహించని అనుభవం ఎదురైంది. 

ఆమె అందమే ఆమెను ఒలింపిక్స్ నుంచి ఇంటికి పంపించేలా చేసింది. ఇంతకీ అసలేం జరిగిందంటే?

పరాగ్వేకు చెందిన లువానా అలోన్సో (20) పారిస్ ఒలింపిక్స్‌లో జరిగిన స్విమ్మింగ్‌ పోటీల్లో పాల్గొన్నారు. 

అయితే జూలై 27న జరిగిన 100 మీటర్ల ఉమెన్స్ బటర్‌ప్లై పోటీల్లో ఓడిపోయారు. 

ఆమె ఓటమి పాలైనప్పటికీ ఒలింపిక్స్‌ ముగిసే వరకు(ఆగస్టు 11వ తేదీ) పారిస్‌లో ఉండేందుకు పరాగ్వే దేశానికి చెందిన బృందం ఏర్పాట్లు చేసింది.

అయితే ఆమె పోటీలు లేకపోవడంతో వివిధ మ్యాచ్‌లు తిలకిస్తూ ఎంజాయ్ చేసింది.

అయితే ఆమె స్మిమ్ షూట్ వేసుకుంటూ అందాలు ఆరబోస్తూ ఒలింపిక్స్‌ క్రీడా గ్రామంలో ఓ స్వప్న సుందరిగా మారిపోయింది. 

దీంతో ఆమెకు విపరీతంగా ఫాలోయింగ్ భారీగా పెరిగింది. అది కాస్త తన సొంత బృందానికి చిరాకు తెప్పించింది.

లువానా తమ క్రీడాకారుల దృష్టి మరల్చుతోందని భావించిన పరాగ్వే బృందం.. ఆమెను సొంత దేశానికి పంపించింది.

దీంతో సొంత దేశానికి చేరుకున్న లువానా ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకుంది.

స్వదేశానికి వెళ్లిన మరుసటి రోజు స్విమ్మింగ్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి అందర్నీ షాక్‌కు గురిచేసింది.