రెమ్యునరేషన్ కారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్‌ను వదులకున్న శ్రీదేవి..!
ఇప్పటితరానికి శ్రీదేవి యుఫోరియా గురించి పెద్దగా తెలియదు.
కానీ మిడిల్ ఏజ్‌లో ఉన్న వాళ్లను అడిగితే.. శ్రీదేవి క్రేజ్ గురించి కథలు కథలుగా చెబుతారు.
ఇప్పుడంటే.. ప్రతీ ఏటా కొత్త హీరోయిన్లు వస్తున్నారు. హిట్లు మీద హిట్లు కొడుతు స్టార్ హీరోయిన్ రేంజ్‌కు వెళ్తున్నారు.
కానీ ఒకప్పుడు శ్రీదేవి కొట్టిన హిట్లు, ఆమెపై ఆడియెన్స్‌లో ఉండే క్రేజ్ స్టార్ హీరోలకు మించి ఉండేది.
ఆమె సినిమా వస్తుందంటే హీరో ఎవరా అని కూడా ఆలోచించకుండా ఆడియెన్స్ థియేటర్ల వైపు పరుగులు తీసేవారు.
ఇక శ్రీదేవి తెలుగులో అప్పటి స్టార్ హీరోలతో చేసింది కానీ.. సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం ఒక్క తెలుగు సినిమా చేయలేదు.
అరాకొరా ఆఫర్స్ కూడా వచ్చాయట కానీ.. ఆమె చేయలేదు.
అయితే ఈ బ్యూటీకి తెలుగు సినిమా చరిత్రను మార్చిన బాహుబలిలో ఆఫర్ వచ్చింది.
రమ్యకృష్ణ కంటే ముందు శివగామి రోల్ కోసం రాజమౌళి శ్రీదేవిని కలిశాడట.
కానీ ఆమె రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేయడంతో రమ్యకృష్ణను ఫైనల్ చేశారట.
అలా కేవలం పారితోషికం కారణంగా ఇండస్ట్రీ హిట్ సినిమాను వదులుకుంది.
More
Stories
ఈ చిట్కాలతో వెన్నునొప్పికి చెక్
ఇంట్లోకి పావురం వస్తే, ఏమవుతుంది?
ఈ పండు సర్వరోగ నివారిణి