వామ్మో.. డబుల్ ఇస్మార్ట్ ఓటీటీ రైట్స్ అన్ని కోట్లా..?

శుక్రవారం రిలీజైన డబుల్ ఇస్మార్ట్ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి.

రామ్ పోతినేని టెర్రిఫిక్ యాక్టింగ్ తప్పితే.. సినిమాలో ఏమి లేదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

పూరీ మేజిక్ మిస్సయిందని, తొలి పార్టులో పావు వంతు కూడా బాలేదని తెలుపుతున్నారు.

మరికొందరు మాత్రం సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా ఉందని తెలుపుతున్నారు.

రామ్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో పాటు.. మేకింగ్ కూడా చాలా బావుందని తెలుపుతున్నారు. 

ఇక డబుల్ ఇస్మార్ట్‌కు ఓటీటీ పార్ట్‌నర్ లాక్ అయింది.

ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది.

అంతేకాకుండా ఈ సినిమా హక్కుల కోసం ఏకంగా రూ.33 కోట్లతో డీల్ కుదరించుకున్నట్లు తెలుస్తుంది.

కేవలం సౌత్ వరకే అన్ని కోట్లని, హిందీ రైట్స్ ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తుంది.

ఇలా కేవలం ఓటీటీ హక్కులతోనే దాదాపుగా బడ్జెట్ రికవరీ అయిపోయింది.

ఇక సినిమా రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చేలా డీల్ కుదరించుకున్నట్లు సమాచారం.