ఏ దేశాల్లో ఎంత మంది నెట్ యూజర్లు ఉన్నారో తెలుసా?

అత్యధికంగా చైనాలో 108.9 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు.

తర్వాతి స్థానంలో ఇండియా ఉంది. ఇక్కడ 88.1 కోట్ల మందికి నెట్ ఉంది.

మూడో స్థానంలో ఉన్న అమెరికాలో 31.1 కోట్ల మందికి నెట్ ఉంది. 

21.5 కోట్లతో ఇండొనేసియా 4వ స్థానంలో ఉంది.

16.5 కోట్లతో బ్రెజిల్ 5వ స్థానంలో నిలిచింది. 

6వ స్థానంలో ఉన్న నైజీరియాలో 13.6 కోట్ల మందికి నెట్ ఉంది. 

పాకిస్థాన్ 13 కోట్ల మందితో 7వ స్థానంలో ఉంది. 

12.9 కోట్లతో రష్యా 8వ స్థానంలో నిలిచింది. 

బంగ్లాదేశ్‌లో 12.6 కోట్ల మంది నెట్ వాడుతుంటే, 9వ స్థానంలో ఉంది. 

జపాన్‌లో 11.7 కోట్ల మందికి నెట్ ఉంది. ఆ దేశం 10వ స్థానంలో ఉంది.

ఇలా ఇంటర్నెట్ విషయంలో మాత్రం భారత్ దూసుకెళ్తోంది.