2 సెకన్ల సీన్ కోసం రూ.8 కోట్ల సెట్...!

మాములుగా సినిమా సెట్‌లు అనేవి చాలా ఖర్చుతో కూడుకున్నవి. 

దాంతో చాలా మంది మేకర్స్ అవసరమైతే మాత్రమే సెట్‌లను వేయిస్తుంటారు. లేదంటే గ్రాఫిక్స్‌తో పని కానిచ్చేస్తుంటారు.

ఈ సినిమాలో ఒక్క సీన్ కోసం ఏకంగా రూ.8 కోట్లు నిర్మాతతో ఖర్చు చేయించాడు. 

ఆ సీన్ కూడా కేవలం 2 సెకండ్లు మాత్రమే ఉంటుంది.

ఈ సినిమాలో ఎస్‌.జే సూర్య ఉండే ఇల్లును ప్రత్యేకంగా తీర్చిదిద్దారట. ఇందు కోసం ఏకంగా రూ.8 కోట్లు ఖర్చయిందట. 

తీరా చూస్తే.. సినిమాలో ఈ ఇల్లు కనిపించేది కేవలం 2 సెకండ్లు మాత్రమే

ఒక్క ఇల్లు సెట్ కోసం రూ.8 కోట్లు అంటే మాముులు విషయం కాదు.

రిలీజ్ ముంగిట ఈ సినిమాపై ఆడియెన్స్‌లో నెలకొన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. 

శంకర్ సినిమా… అందులోనూ కల్ట్ క్లాసిక్ భారతీయుడు సినిమాకు సీక్వెల్. ఇంతకంటే.. హైప్ ఎక్కించుకోవడానికి మ్యాటరేముంది.

ఈ లెక్కన శంకర్ ఎంత దారుణంగా సినిమా తీశాడో అర్థం చేసుకోవచ్చు. 

ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో అత్యంత డిజాస్టర్‌లలో ఒకటిగా ఈ సినిమా నిలిచింది.