కిరణ్ అబ్బవరం-రహస్య గోరక్ పెళ్లి ఫోటోలు..!

టాలీవుడ్ లవ్ బర్డ్స్ కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి అయ్యారు.

గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఆగస్టు 22 అర్థరాత్రి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. 

వీళ్ల పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 

ఇక సంగీత్ నుంచి మెహందీ వరకు అన్నీ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

ఇక ఈ జంట మార్చి 13న ఘనంగా ఎంగేజ్ మెంట్ జరుపుకుంది. 

ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్ది మంది సినీ సెలబ్రెటీలు మాత్రమే హాజరు అయ్యారు.

ఐదేళ్ల కిందట వచ్చిన రాజావారు రాణీ గారు సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు.

 ఈ సినిమా మరీ బ్లాక్ బస్టర్ హిట్టు అవలేదు కానీ.. ఉన్నంతలో బానే ఆడింది. 

మరీ ముఖ్యంగా వీళ్ల కెమెస్ట్రీకీ మంచి మార్కులు పడ్డాయి.

 కెరీర్‌ మొదట్లో వరుస హిట్లతో మంచి స్పీడ్‌ చూపించిన కిరణ్‌.. ఈ మధ్య కాస్త డల్‌ అయ్యాడు.

ప్రస్తుతం కిరణ్ అబ్బవరం ‘క’ అనే సినిమా చేస్తున్నాడు.