ప్రభాస్ హీరోయిన్‌ ఇమాన్వీ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా..?

‘సలార్’, ‘కల్కీ’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ల తర్వాత ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి పీరియాడిక్ సినిమా చేస్తున్నాడు. 

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఇటీవలే ఘనంగా లాంఛనింగ్ కార్యక్రమాలు జరుపుకుంది. 

ఈ వేడుకలో అందరి చూపులు మాత్రం హీరోయిన్ ఇమాన్విపైనే ఉన్నాయి. 

ప్రభాస్ పక్కన ఛాన్స్ కొట్టేసిందని తెలియగానే.. అసలు ఎవరీ దేవకన్య, ఇప్పటి వరకు ఏం సినిమాలు చేసిందని నెటీజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. 

ఆమె పేరు ఇమాన్ ఇస్మాయిల్. 12 ఏళ్ల వయసు నుంచి డ్యాన్స్ నేర్చుకుంటున్న ఇమాన్.. సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది.

న్యూయార్క్‌లో మాస్టర్స్ చదివిన ఇమాన్ ఇస్మాయిల్, సోషల్ మీడియాలో ‘ఇమాన్వీ’ పేరుతో పాపులారిటీ తెచ్చుకుంది.

క్లాసికల్ డ్యాన్స్‌లతో పాటు పలు సినిమా పాటలకు సంబంధించిన వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. 

అలా డ్యాన్స్ వీడియోల ద్వారా ప్రభాస్ సినిమాలో చాన్స్ కొట్టేసింది.

ఈ బ్యూటీకి ప్రభాస్-హను సినిమా కోసం భారీ పారితోషికం ముట్టజెప్పుతున్నట్లు తెలుస్తుంది. 

ఇన్ సైడ్ రిపోర్ట్స్ ప్రకారం. ఇమాన్వీకి ఈ సినిమా కోసం ఏకంగా కోటీ రూపాయల వరకు రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

ప్రభాస్ ఈ సినిమాలో సోల్జర్‌గా కనిపించనున్నాడట.