వైద్యులు నాలుక ఎందుకు చూస్తారో తెలుసా? 

ఆరోగ్యం బాలేనప్పుడు డాక్టర్ దగ్గరకి వెళ్తే ముందుగా నాలుకను చెక్ చేస్తారు.

దాని రంగును బట్టి మన ఆరోగ్యం ఎలా ఉందనేది చెప్పేస్తారు.

అయితే డాక్టర్స్ అలా ఎందుకు చూస్తారో చాలా మందికి తెలియదు.

ఆరోగ్యంగా వారి నాలుక లేత లేదా ముదురు గులాబీ రంగులో ఉంటుంది.

ఎవరైతే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటారో వారి నాలుగు గులాబీ రంగులో మాత్రమే ఉంటుంది.

నాలుకపై తెల్లని మచ్చలు కనిపిస్తే ఈస్ట్ ఇన్ఫెక్షన్‌కి సంకేతంగా చెప్పవచ్చు. 

అదే నాలుక నీలిరంగులో ఉంటే అది హృదయ సంబంధిత రుగ్మతలకు సూచిస్తుంది.

నాలుక ఎర్రగా మారితే విటమిన్ లోపం ఉన్నట్లు అర్థం. దీంతో పాటుగా వారికి జ్వరం ఉందని కూడా అర్థం.

మృదువుగా మారితే ఇన్ఫెక్షన్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ లోపం ఉన్నట్లు.

నాలుక తెల్లగా మారితే రోగనిరోధక శక్తి తగ్గినట్లు సంకేతంగా భావించవచ్చు.

నాలుక పగిలినట్లు ఉంటే అది సోరియాసిస్ వంటి సమస్యలకు కారకంగా భావిస్తారు.