పిల్లలకు వాహనాలిస్తే రూ.25 వేలు జరిమానా.. జైలు శిక్ష

నిజామాబాద్‌లో కఠినంగా ట్రాఫిక్ రూల్స్ అమలు.

పాటించాలన్న జిల్లా జడ్జి సునీత, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతో ప్రమాదాలు.

మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులే నేరస్థులు.

చట్ట ప్రకారం మూడేళ్ళ వరకు కారాగార శిక్ష.

రూ.25 వేల వరకు జరిమానా పడుతుంది.

మైనర్లకు వాహనాలు నడిపేందుకు అనుమతించకూడదు.

లైసెన్స్ కలిగిన వారు మాత్రమే వాహనాలు నడపాలని జిల్లా జడ్జి హితవు పలికారు.

హెల్మెట్ వల్ల 90 శాతం ప్రాణాపాయం నుంచి కాపాడుకోవచ్చు.