విశ్వంభర@120 కోట్లు.. మెగాస్టారా మజాకా..!

దాదాపు రెండొందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు.

పంచభూతాలను ఏకం చేసే ఓ కాలచక్రాన్ని పోస్టర్‌లో చూపిస్తూ ప్రీ లుక్ తోనే సినిమాపై తిరుగులేని క్యూరియాసిటీ క్రియేట్‌ చేశారు మేకర్స్. 

ఈ సినిమా కథ మూడు లోకాల చుట్టూ తిరుగుతుందట.

మరీ ముఖ్యంగా ఒళ్లు జలదరించే వీఎఫ్ఎక్స్ ఇందులో కనిపించనున్నాయట. దాని కోసం హాలీవుడ్ టెక్నీషీయిన్లను పనిచేస్తున్నారు.

ఈ సినిమా థియేట్రికల్ హక్కుల కోసం ఓ డిస్ట్రిబ్యూటర్ ఏకంగా రూ.120 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. 

అది కూడా కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి..

దీన్ని బట్టి చూస్తే.. బాస్ క్రేజ్ ఇంకా ఏ మాత్రం తగ్గలేదని క్లారిటీ వచ్చేసింది. 

మరీసెంట్‌గా రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే సినిమా అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

మళ్లీ బాస్‌ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో.. అచ్చంగా అలానే చూపించాడు డైరెక్టర్ మల్లిడి వశిష్ట.

యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ పాన్‌ ఇండియా సినిమాకు కీరవాణి స్వరాలు అందించనున్నాడు.

త్రిషతో పాటు మరో ముగ్గురు హీరోయిన్‌లు ఈ సినిమాలో నటిస్తున్నారు.