వామ్మో.. సరిపోదా శనివారం ఓటీటీ రైట్స్ అన్ని కోట్లా..?

భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజైన సరిపోదా శనివారం సినిమా మిక్స్డ్ రివ్యూలు తెచ్చుకుంది.

కాన్సెప్ట్ కొత్తగానే ఉన్నా.. డ్రామా సాగదీశాడని పలువురు నెటీజన్లు తెలుపుతున్నారు. 

నాని, ఎస్.జే సూర్యలు పోటీ పడి మరీ నటించారని అంటున్నారు. 

వివేక్ ఆత్రేయా మేకింగ్ చాలా బాగుందని కానీ, ఎడిటింగ్‌కు ఇంకాస్త పని చెప్పుంటే బాగుండేది అభిప్రాయపడ్డారు.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ మాత్రం షాకింగ్‌‌గు గురిచేస్తుంది.

ఈ సినిమా హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. 

కాగా సౌత్‌తో పాటు నార్త్ హక్కులు కలిపి అక్షరాల రూ.45 కోట్లకు డీల్ క్లోజ్ అయిపోయిందని సమాచారం. 

అంతేకాదు నాని కెరీర్‌లో ఇదే హైయెస్ట్.

ఇక ఈ సినిమాకు రూ.90 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు ఇన్ సైడ్ టాక్.

ఈ లెక్కన ఒక్క ఓటీటీ హక్కుల ద్వారానే రూ.45 కోట్లు వచ్చేశాయి. 

థియేట్రికల్ బిజినెస్ రూ.41 కోట్లు.. ఇతర శాటిలైట్, ఆడియె రైట్స్ ద్వారా మొత్తంగా టేబుల్ ప్రాఫిట్‌తోనే సినిమా రిలీజైంది.