10 వేల మంది రాక్షస సైన్యంతో 'దేవర' యుద్ధం..?

సరిగ్గా నాలుగు వారాల్లో ఈ పాటికి దేవర గురించి చర్చలు జరుతుంటాయి. 

ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, పాటలు ఆడియెన్స్‌లో క్రియేట్ చేసిన అంచనాలు అంతా ఇంతా కాదు.

ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని తారక్ ఫ్యాన్స్‌తో సహా, సినీ లవర్స్ అందరూ అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు.

మరోవైపు సినిమాకు సంబంధించిన పలు లీకులు అమాంతం అంచనాలు ఆకాశానికి ఎత్తేస్తున్నాయి.

ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ సోషల్ మీడియాను ఊపేస్తుంది.

ఎన్టీఆర్ సముద్ర తీరంలో ఉన్న 10 గ్రామాలకు రక్షణగా ఉంటాడట.

అంతేకాకుండా ఈ గ్రామాల్లో కోట్లు విలువ చేసే నిధి ఉందని, దాన్ని సైఫ్ ఎలాగైనా దక్కించుకోవాలని.. 

దాదాపు 10 వేల మంది ఉండే రాక్షస సైన్యాన్ని తయారు చేస్తాడట. 

అలా ఆ రాక్షస సైన్యాన్ని మట్టు కరిపించేందుకు దేవర సముద్ర తీరంలో రక్త పాతం సృష్టిస్తాడట.

ఇండియన్‌ సినీ చరిత్రలో ఇప్పటివరకు మనం చూడని యాక్షన్ సీన్లను దేవర టీమ్ డిజైన్‌ చేస్తుందట. 

ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మరో నాలుగు వారాలు వేచి చూడాల్సిందే...