ఐశ్వర్యరాయ్ తెలుగులో నటించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా..?

ఇప్పటి తరానికి ఐశ్వర్యరాయ్ క్రేజ్ గురించి పెద్దగా తెలియకు పొవచ్చు. 

80s,90s కిడ్స్‌ని అడిగితే కవిత్వాలు అల్లేస్తారు. 

అసలు ఒక రెండు దశాబ్దాల పాటు ఐశ్వర్యరాయ్ యుఫోరియా నడిచింది.

సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలే ఆమె అందానికి దాసోహం అయ్యారు. ఇక మనమెంత చెప్పండి.

అందానికి కూడా అసూయ పుట్టే అందం ఐశ్వర్యరాయ్‌ది. 

కేవలం ఆమె కోసమే సినిమాలను రిపీటెడ్‌గా థియేటర్‌లో చూసిన కుర్రాకారు ఎందరో.

ఈ బ్యూటీ తెలుగులో ఒక సినిమాలో నటించిందన్న విషయం చాలా మందికి తెలియదు.

ఆ సినిమా పేరు ‘రావోయి చందమామ’. 

నాగార్జున హీరోగా జయంత్ సి.పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1999లో రిలీజైంది. 

కాగా ఈ సినిమాలో లవ్ టు లివ్ అనే ఒక్క స్పెషల్ సాంగ్‌లో మాత్రమే ఐశ్వర్యరాయ్ కనిపించింది.

అలా కేవలం ఈ ఒక్క సినిమాలో మాత్రమే ఐష్ కనిపించింది. కల్కీ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మించాడు.