ప్రభాస్ రాజాసాబ్ మూవీ@400 కోట్లు..!

ప్రభాస్ లైనప్‌లో ఉన్న సినిమాల్లో రాజా సాబ్ ఒకటి.

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.

ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ మాములు ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేయలేదు.

అసలు డార్లింగ్‌ను వింటేజ్ లుక్‌లో చూసి ఫ్యాన్స్ తెగ సంబురాలు చేసుకుకున్నారు.

అంతేకాదు ఇన్ని రోజులుగా డార్లింగ్ ఫ్యాన్స్‌కు కాస్త టెన్షన్ ఉండేది. 

మారుతి అసలు ప్రభాస్‌ను హ్యాండిల్ చేస్తాడా.. ప్రభాస్‌ను ఎలా చూపిస్తాడో అన్న టెన్షన్ బీభత్సంగా ఉండేది. 

కానీ ఒక్క గ్లింప్స్‌తో డార్లింగ్ ఫ్యాన్స్ భయాన్ని తునకలు చేసేశాడు. 

పైపెచ్చు ఇప్పటివరకు ఈ సినిమాపై ఉన్న అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. 

తాజాగా ఈ సినిమా నిర్మాత రాజాసాబ్ బడ్జెట్‌పై క్లారిటీ ఇచ్చాడు.

రాజా సాబ్ బడ్జెట్ అక్షరాల రూ.400 కోట్లట.

ఈ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.